వైసీపీ నేత కుడిపూడి చిట్టబ్బాయి హఠాన్మరణం!

ysrcp Leader Kudipudi Passes Away
మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్న పేరు తెచ్చుకున్న కుడిపూడి చిట్టబ్బాయి, ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా, అప్పటి నుంచి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి, ఆయన కన్ను మూశారు.

ఆయన మృతితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వైసీపీ కోనసీమలో ఓ సమర్థవంతమైన నేతను కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబీకులను ఫోన్ లో పరామర్శించిన జగన్, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. చిట్టబ్బాయి మృతి పట్ల పలువురు నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

Go Back to Shorts
Kudipudi Chittabbai
Died
Passes Away
Jagan
Condolence
YSRCP

More Telugu News