వైసీపీ నేత కుడిపూడి చిట్టబ్బాయి హఠాన్మరణం!
- బీసీల నేతగా పేరు తెచ్చుకున్నచిట్టబ్బాయి
- కొన్ని రోజుల క్రితం సోకిన కరోనా మహమ్మారి
- చికిత్స పొందుతూ కన్నుమూత
ఆయన మృతితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వైసీపీ కోనసీమలో ఓ సమర్థవంతమైన నేతను కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబీకులను ఫోన్ లో పరామర్శించిన జగన్, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. చిట్టబ్బాయి మృతి పట్ల పలువురు నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.