తిరుపతి నుంచి 1,049 మంది కరోనా పేషెంట్ల ఆచూకీ గల్లంతు!
- గత రెండు నెలల్లో తిరుపతిలో 9,164 కేసుల నమోదు
- తిరుపతిని వదిలి వెళ్లిపోయిన 845 మంది బాధితులు
- తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్న వైనం
కరోనా శాంపిల్స్ ఇచ్చే సమయంలో బాధితులు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. ఆ తర్వాత టెస్టు రిపోర్టులు రాకముందే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యక్తులు ఇతరులకు కూడా కరోనాను అంటిస్తున్నారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.