నిర్మాతగా మారుతున్న చిరూ కూతురు సుస్మిత!
- తమిళంలో హిట్ కొట్టిన '8 తొట్టక్కల్'
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
- యంగ్ హీరోతో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
ఇందులో హీరో ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక నేరస్థుడిని పట్టుకునే ప్రయత్నంలో తన రివాల్వర్ పోగొట్టుకుంటాడు. రివాల్వర్ ను దొంగిలించిన వ్యక్తి దానిని వేరేవారికి అమ్మేస్తాడు. పర్యవసానంగా చోటుచేసుకునే సన్నివేశాలతో ఈ కథ నడుస్తుంది. వైవిధ్యభరితమైన మలుపులతో సాగే ఈ థ్రిల్లర్ మూవీని శ్రీ గణేశ్ తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమాను ఒక యంగ్ హీరోతో సుస్మిత తెలుగులో రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటోందట. నిర్మాతగా ఆమె తొలి సినిమాలో హీరో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.