ఏపీలో కరోనా పరిస్థితులపై రేపు మంత్రుల కమిటీ సమావేశం
- కరోనా నియంత్రణ చర్యల పర్యవేక్షణకు కమిటీ
- ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- గత నెలలో ఓసారి సమావేశమైన కమిటీ
- రేపు మరోసారి సమావేశం అవుతున్నట్టు ఆళ్ల నాని వెల్లడి
- కరోనా కట్టడి చర్యలపై సమీక్ష
తాజాగా ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ, రేపటి సమావేశంలో కీలకమైన అంశాలను చర్చిస్తామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సినేషన్, రెమ్ డెసివిర్ అంశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. కాగా, మంత్రుల కమిటీ గత నెలలోనూ సమావేశమై కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్ష చేపట్టింది.