Ravindra Jadeja: 'ఆసిక్స్' బ్రాండ్ అంబాసిడర్ గా రవీంద్ర జడేజా

Ravindra Jadeja appointed as Asics brand ambassador
  • అంతర్జాతీయ గుర్తింపు పొందిన క్రీడా ఉపకరణాల సంస్థ 'ఆసిక్స్'
  • భారత్ లో కార్యకలాపాలపై దృష్టి
  • ప్రచారకర్తగా రవీంద్ర జడేజాతో ఒప్పందం
  • ఎంతో ఉద్విగ్నంగా ఉందన్న జడేజా
అంతర్జాతీయ క్రీడా ఉపకరణాల సంస్థ 'ఆసిక్స్' తన బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజాను నియమించింది. మెరుపు ఫీల్డింగ్ కు పెట్టింది పేరైన రవీంద్ర జడేజా ఇటీవల కాలంలో ఆల్ రౌండ్ నైపుణ్యంతో అదరగొడుతున్నాడు. టీమిండియాకైనా, ఐపీఎల్ టీమ్ కైనా ఒకేరకం అంకింతభావం కనబరిచే జడ్డూపై 'ఆసిక్స్' దృష్టి పడడంలో ఆశ్చర్యమేమీలేదు. దీనిపై జడేజా సోషల్ మీడియాలో స్పందించాడు.

భారత్ లో 'ఆసిక్స్' బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడ్నవడం పట్ల ఎంతో గర్విస్తున్నానని, చాలా థ్రిల్ ఫీలవుతున్నానని వెల్లడించాడు. మనసులను, శరీరాలను సరికొత్త శక్తి దిశగా నడిపించే బ్రాండ్ 'ఆసిక్స్' తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా కరోనాతో జాగ్రత్తగా ఉండాలని జడేజా సందేశం అందించాడు. ఈ పరీక్షా సమయంలో అందరూ ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని పిలుపునిచ్చాడు. బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవడం, శుభ్రంగా కడుక్కోవడం వంటి రక్షణ చర్యలు పాటించాలని సూచించాడు.
Ravindra Jadeja
Asics
Brand Ambassador
Sports
Team India

More Telugu News