కరోనాతో అల్లాడుతున్న భారత్ కు చైనా ఆపన్నహస్తం
- 800 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపిన డ్రాగన్ దేశం
- వారంలో మరో 10 వేలు పంపేందుకు చర్యలు
- ఇప్పటికే సాయానికి ముందుకొచ్చిన పలు దేశాలు
దేశంలో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అయిపోయి పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్ ను తరలించేందుకు ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది.