Mansukh Mandavia: కొవిడ్ వారియర్ గా కుమార్తె.. గర్వంగా ఉందన్న కేంద్ర మంత్రి

Union Minister Mansukh Mandavia shares his joy after his daughter became covid warrior
  • ట్విట్టర్ లో ఆనందాన్ని పంచుకున్న మన్సుఖ్ మాండవ్య
  • పీపీఈ సూట్లో కుమార్తె దిశా
  • హృదయం ఉప్పొంగిపోతోందన్న మాండవ్య
  • నా యోధురాలికి మరింత శక్తి కలగాలని ఆకాంక్ష
దేశంలో మరోసారి కరోనా ఉత్పాతం నెలకొన్నవేళ వైద్య సిబ్బందికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది. కాగా, కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవ్య కుమార్తె దిశా కూడా కొవిడ్ వారియర్ గా అవతారం ఎత్తారు. ఓ కొవిడ్ రిసోర్స్ సెంటర్ లో పీపీఈ సూట్ ధరించి ఉన్న దిశా ఫొటోను మన్సుఖ్ మాండవ్య స్వయంగా పంచుకున్నారు. కరోనా ముందు వరుస యోధురాలిగా మారిన తన కుమార్తెను చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.

"దిశా... నిన్ను ఈ పాత్రలో చూసేందుకు చాలాకాలం వేచి చూశాను. ఈ సంక్షోభ సమయంలో నువ్వు ఇంటర్న్ షిప్ రూపంలో విధులు నిర్వర్తిస్తుండడం చూసి నా హృదయం పొంగిపోతోంది. జాతికి నీ సేవలు అవసరం. నిన్ను నువ్వు నిరూపించుకుంటావని గట్టిగా నమ్ముతున్నాను. నా యోధురాలికి మరింత శక్తి కలగాలి" అంటూ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Mansukh Mandavia
Disha
Covid Warrior
India

More Telugu News