Nara Lokesh: నీ జేసీబీ ఊపులకు భయపడే వాడు లేడు జగన్ రెడ్డి: నారా లోకేశ్

lokesh slams ycp
  • ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారు
  • ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు
  • ప‌ల్లా శ్రీ‌నివాస్ గారిపై కక్షపూరిత చర్యలకు దిగారు
  • అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబీ ప్రభుత్వం అన్నది  
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‎ కు చెందిన భ‌వ‌నాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై టీడీపీ నేత‌ నారా లోకేశ్ విమ‌ర్శ‌లు గుప్పించారు. 'ప్రజల ప్రాణాలు గాలికొదిలి ప్రతిపక్ష నేతల భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి, కార్మికుల పక్షాన నిలిచినందుకే టీడీపీ నేత ప‌ల్లా శ్రీ‌నివాస్ గారిపై కక్షపూరిత చర్యలకు దిగారు' వైఎస్ జ‌గ‌న్ అని ఆరోపించారు.

'విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా గారి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబీ ప్రభుత్వం అన్నది' అని నారా లోకేశ్ విమ‌ర్శించారు.

'కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధ వాతావరణంలో భవనాన్ని కూల్చివేయడాన్ని, కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ జేసీబీ ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి' అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News