Vijayasai Reddy: చంద్రబాబును కర్మ పగబట్టినట్టు తరుముతోంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Chandrababu
  • నాకు కూడా ఏసీబీ ఉందని చంద్రబాబు గర్జించారు
  • ఇప్పుడు ఆయన నోరు పెగలడం లేదు
  • వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాశనం చేశారు
సంగం డెయిరీ విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఖబడ్దార్.. నీకు ఏసీబీ ఉంటే నాకు కూడా ఏసీబీ ఉందంటూ గర్జించిన చంద్రబాబు నోరు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదని విజయసాయి ఎద్దేవా చేశారు. చంద్రబాబును కర్మ పగబట్టినట్టు తరుముతోందని అన్నారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. జగన్ పాలనతో న్యాయం, ధర్మం మళ్లీ ఊపిరి పోసుకున్నాయని అన్నారు. దోషులెవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు.

మరోవైపు, విశాఖ జిల్లా పెందుర్తిలో ఇటీవల ఒక కుటుంబం మొత్తం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాధిత కుటంబాన్ని ఈరోజు విజయసాయి పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయసహకారాలను అందిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. హత్య కేసులో వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Vijayasai Reddy
YSRCP
Jagan
Chandrababu
Telugudesam

More Telugu News