CM KCR: కొవిడ్​ ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు.. సీఎం కేసీఆర్​ కీలక ఆదేశాలు

CM KCR Alerts Health department Over Fire Accidents in Covid Hospitals
  • వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేసిన సీఎం
  • ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచన
  • అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం
  • అన్ని ఆసుపత్రులకూ ఆక్సిజన్ అందేలా చూడాలని ఆదేశాలు
దేశంలోని కొవిడ్ ఆసుపత్రుల్లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాంధీ, టిమ్స్ వంటి ఆసుపత్రుల్లో పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అగ్నిమాపక పరికరాలు, యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. కరోనా టెస్ట్ కిట్లకు కొరత రాకుండా చూసుకోవాలని, విదేశాల నుంచి గగనతల మార్గాల్లో కిట్లను దిగుమతి చేసుకోవాలని సూచించారు. అవసరమున్న అన్ని ఆసుపత్రులకు సకాలంలో ఆక్సిజన్ అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకనుగుణంగా ఆక్సిజన్ నిల్వలను పెంచుకునేలా వివిధ రాష్ట్రాల నుంచి సైనిక విమానాల్లో ప్రాణవాయువును సరఫరా చేస్తున్నామని చెప్పారు.
CM KCR
KCR
Telangana
COVID19

More Telugu News