Manchu Lakshmi: మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలి: మంచు లక్ష్మి

KTR get well soon says Manchu Lakshmi
  • కరోనా బారిన పడిన కేటీఆర్
  • త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్న ప్రముఖులు
  • ఈలోగా తన సినిమాలన్నీ చూసేయాలని కేటీఆర్ కు లక్ష్మి సూచన
తెలంగాణ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తనలో స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నాయని... ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని కేటీఆర్ తెలిపారు. హోమ్ ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పారు. మరోవైపు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఎందరో ప్రముఖులు ట్వీట్లు చేస్తున్నారు. సినీ నటి, మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మిత్రుడు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని అన్నారు. ఈలోగా తన సినిమాలు అన్నీ చూసేయాలని సరదా వ్యాఖ్యలు చేశారు. ఈ  వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా కౌంటర్ ఇస్తున్నారు. మీ సినిమాలు అన్నీ చూస్తే చనిపోతారని కొందరు... మీ సినిమాలు అన్నీ చూడటం కంటే కరోనాతో సావాసం చేయడమే బెటర్ అని మరికొందరు కామెంట్ చేశారు.
Manchu Lakshmi
Tollywood
KTR
TRS

More Telugu News