AP High Court: టెండర్లు ఖరారు చేయొద్దు.. విశాఖ భూముల అమ్మ‌కాల‌పై హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

high court orders on vizag lands
  • ఐదు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌ భూముల అమ్మకానికి నోటిఫికేష‌న్‌
  • ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌
  • నేడు హైకోర్టులో విచారణ  
విశాఖ నగరంలో ఐదు ప్రాంతాల్లో ప్ర‌భుత్వ‌ భూముల అమ్మకానికి గతంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు నోటిఫికేషన్‌ జారీ చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు విచారణ జరిపి, ఆ భూముల అమ్మకంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో బిల్డ్‌ ఏపీ పేరిట అమ్మకాలపై స్టే ఇచ్చిన విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో... అవే ఆదేశాలు విశాఖ భూముల అమ్మకానికి కూడా వర్తిస్తాయని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. టెండర్లు ఖరారు చేయొద్దని చెప్పింది. టెండరు ఖరారుపై  న్యాయ‌స్థాన తీర్పునకు లోబడే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది.
AP High Court
Andhra Pradesh
Vizag

More Telugu News