Justice Ramana: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రేపు ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం

Justice NV Ramana to take oath as CJI tomorrow
  • జస్టిస్ ఎన్వీ రమణతో ప్రమాణం చేయించనున్న రాష్ట్రపతి
  • కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది మాత్రమే హాజరుకానున్న వైనం
  • ఈరోజుతో ముగుస్తున్న జస్టిస్ బాబ్డే పదవీకాలం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జస్టిస్ రమణతో ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. కరోనా నేపథ్యంలో అతి కొద్ది మంది సమక్షంలో రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, కేంద్ర న్యాయశాఖ ఉన్నతాధికారులు, జస్టిస్ రమణ కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే పదవీకాలం ఈరోజుతో ముగుస్తోంది. సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ బాధ్యతలను స్వీకరించనున్నారు.
Justice Ramana
Supreme Court
Oath

More Telugu News