కరోనాతో పుట్టినరోజునే కన్నుమూసిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగిని!
- కామారెడ్డి జిల్లాలో ఘటన
- తాడ్వాయిలో పనిచేస్తున్న విజయ
- అనతికాలంలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక
- బోరున విలపించిన ఇతర ఉద్యోగులు
గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా సెలక్ట్ అయి, ఆపై కొద్దికాలంలోనే తన పనితీరు, విద్యార్హతలతో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఆమె పోస్టింగ్ ను పొందారు. అనతికాలంలోనే రెండు సార్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆమెను ఎంతో మంది ఉన్నతాధికారులు ప్రశంసించారు కూడా. ఆమె మరణించడం తమ కార్యాలయానికి ఎంతో లోటని, ఆమె కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని అధికారులు వ్యాఖ్యానించారు.