భారత్ నుంచి వచ్చే భక్తులకు కైలాస ద్వీపంలోకి అనుమతి లేదు: నిత్యానంద
- కైలాస ద్వీపంలో ఉంటున్న నిత్యానంద
- కరోనా నేపథ్యంలో భారత్ తో పాటు మరిన్ని దేశాల భక్తులపై నిషేధం
- తదుపరి ప్రకటన వరకు ఎవరూ రావద్దని విన్నపం
అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో నిత్యానంద కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి వచ్చే భక్తులను ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతించలేమని ప్రకటించారు. భారత్ తో పాటు బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మలేసియా నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు అనుమతి లేదని చెప్పారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.