ఢిల్లీవాసులను భయపెడుతున్న డెంగీ.. రికార్డు స్థాయిలో కేసుల నమోదు
- 1996 నుంచి ప్రతి సంవత్సరం డెంగీ బారిన ఢిల్లీ
- ఈ ఏడాది ఇప్పటి వరకు 13 కేసులు
- జాగ్రత్తగా ఉండాలంటున్న అధికారులు
మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 22 మంది నగరంలో డెంగీకి చికిత్స పొందుతున్నట్టు అధికారులు తెలిపారు.1996 నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీలో జులై-నవంబరు మధ్య డెంగీ కేసులు పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. డెంగీ అనేది వ్యాక్సిన్ లేని వైరల్ వ్యాధి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నివాస పరిసరాల్లో దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, గతేడాది డిసెంబరు 5 నాటికి ఢిల్లీలో దాదాపు 1000 డెంగీ కేసులు నమోదయ్యాయి.