'ఆకాశం నీ హద్దురా' దర్శకురాలితో మహేశ్ బాబు?
- తమిళనాట సుధ కొంగరకి మంచి క్రేజ్
- ఆమె కథకి మహేశ్ ఓకే చెప్పాడనే టాక్
- ఆల్రెడీ రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టేసిన మహేశ్
దర్శకురాలిగా తమిళంలో సుధా కొంగరకి మంచి పేరు ఉంది. ఇటీవల తమిళంలో సూర్య హీరోగా ఆమె తెరకెక్కించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా విజయంతో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. అలాంటి ఆమె ఇటీవల మహేశ్ బాబును కలిసి ఒక కథ వినిపించారట. ఆ కథలోని కొత్తదనం నచ్చడంతో వెంటనే ఆయన ఓకే చెప్పాడని అంటున్నారు.
అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశం లేదు. ఎందుకంటే, ముందుగా మహేశ్ బాబు .. పరశురామ్ దర్శకత్వంలో చేస్తున్న 'సర్కారువారి పాట' పూర్తిచేయాలి. ఆ తరువాత ప్రాజెక్టులుగా త్రివిక్రమ్ .. రాజమౌళి సినిమాలు లైన్లో ఉన్నాయి. అంటే ఓ రెండేళ్ల తరువాతనే ఈ సినిమా ఉండే అవకాశం ఉందనుకోవాలి.