అయిష్టంగానే నాని ఆ కథను విన్నాడట!
- శివ నిర్వాణతో నాని రెండో సినిమా
- వాయిదాపడిన 'టక్ జగదీశ్'
- కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ అంటున్న నాని
తాజాగా ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ .. " శివ నిర్వాణ నాకు కాల్ చేసి ఒక మంచి కథ ఉంది .. వినిపించాలని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఆల్రెడీ మా ఇద్దరి కాంబినేషన్లో 'నిన్నుకోరి' అనే ఒక ప్రేమకథ వచ్చింది. మళ్లీ ఇతను ప్ర్రేమకథనే తీసుకుని వచ్చి ఉంటాడని అనుకున్నాను. మొహమాటానికి వినేసి బాగోలేదని చెప్పేస్తే ఒక పనైపోతుంది గదా అనుకున్నాను. అతను వచ్చి 'టక్ జగదీశ్' కథను వినిపించాడు. ఆ కథ వినగానే నేను షాక్ అయ్యాను .. అంత గొప్పగా అనిపించింది. నా కెరియర్లో నాకు బాగా నచ్చిన కథ ఇది. నేను కూడా ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.