Atchannaidu: ఎందరో రాష్ట్రపతులు, ప్రధానులను నిర్ణయించిన నాయకుడు చంద్రబాబు: అచ్చెన్నాయుడు

Chandrababu behind many presidents and PMs says Atchannaidu
  • శ్రమను, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు
  • ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం పాటు సీఎంగా సేవలందించారు
  • చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలి
టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈరోజు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, 40 ఏళ్లుగా శ్రమను, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.

70 ఏళ్లను పూర్తి చేసుకున్న యువకుడు చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు చేపట్టని పదవులు లేవని, ఉమ్మడి ఏపీకి సుదీర్ఘకాలం పాటు సీఎంగా సేవలందించారని చెప్పారు. ఎందరో రాష్ట్రపతులు, ప్రధానమంత్రులను నిర్ణయించిన వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆయనను మళ్లీ సీఎం చేసేంత వరకు ప్రతి టీడీపీ కార్యకర్త అకుంఠిత దీక్షతో పని చేయాలని పిలుపునిచ్చారు.
Atchannaidu
Chandrababu
Telugudesam

More Telugu News