Pawan Kalyan: కేసీఆర్ గారు త్వ‌ర‌గా కోలుకోవాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్

Wishing you a speedy recovery says pawan
  • ఎప్ప‌టిలాగే ప్ర‌జా సేవ‌లో మ‌ళ్లీ నిమ‌గ్నం కావాలి 
  • అలాగే, మ‌న్మోహ‌న్ సింగ్ గారు కోలుకోవాలి  
  • ప్రకటన విడుదల చేసిన పవన్ కల్యాణ్ 
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దీనిపై జ‌న‌సేన  అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తూ.. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కోలుకుని ఎప్ప‌టిలాగే ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు.

అలాగే, మ‌న్మోహ‌న్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు స‌మాచారం అందింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఆయ‌న కూడా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని తాను దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కూడా క‌రోనా సోక‌డంతో ఆయ‌న ప్ర‌స్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి అక్క‌డే  చికిత్స తీసుకుంటున్న‌ విష‌యం తెలిసిందే.

 
Pawan Kalyan
Janasena

More Telugu News