Prabhas: 'సలార్' కోసం సిద్ధమైన భారీ సెట్లు!

salaar movie sets are ready on Hyderabad and Gujarat
  • పూర్తిస్థాయి రఫ్ లుక్ తో ప్రభాస్
  • సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్
  • హైదరాబాద్ .. గుజరాత్ లలో షూటింగ్  
ప్రభాస్ .. ఇప్పుడు ఈ పేరుతో వందల కోట్ల రూపాయల పెట్టుబడితో సినిమాలు రూపొందుతున్నాయి. వందల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషా ప్రేక్షకులు సైతం ఆయన సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా ఆయన సినిమాల అప్ డేట్స్ తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. ప్రస్తుతం ఆయన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ లోను .. మరో యాక్షన్ మూవీలోను నటిస్తున్నాడు.

రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్' నిర్మితమవుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. ఇక భారీ యాక్షన్ మూవీగా 'సలార్' రూపొందుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పూర్తి రఫ్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ సెట్ వేశారు. అలాగే గుజరాత్ లోను ఒక భారీ సెట్ వేశారు. ఇప్పుడు ఈ రెండు సెట్లు షూటింగుకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చేనెలలో హైదరాబాద్ లో .. ఆ తరువాత షెడ్యూల్ ను గుజరాత్ లో చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా శ్రుతిహాసన్ అలరించనుంది.
Prabhas
Sruthi Haasan
Prashanth Neel

More Telugu News