Chiranjeevi: నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు: చిరంజీవి

Chiranjeevi conveys birthday greetings to Chandrababu
  • నేడు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం
  • చంద్రబాబు వయస్సు 71 సంవత్సరాలు
  • చంద్రబాబుకు దీర్ఘాయుష్షు ఉండాలని ఆకాంక్షించిన చిరంజీవి
టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనకు ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు. అనునిత్యం ఎంతో కష్టపడే, నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబుగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చిరంజీవి ట్వీట్ చేశారు. మీకు మంచి ఆరోగ్యం, సంతోషం ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు మీకు దీర్ఘాయుష్షు ఉండాలని కోరుకుంటున్నానని చిరు చెప్పారు.

చంద్రబాబు 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జన్మించారు. ఈరోజుతో ఆయన 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నప్పుడే ఆయన రాజకీయాలవైపు మొగ్గు చూపారు. చంద్రగిరి యూత్ కాంగ్రెస్ లీడర్ గా ప్రారంభమైన ఆయన రాజకీయ జీవితం... సుదీర్ఘ కాలం పాటు ఏపీ సీఎంగా సేవలందించేంత వరకు వెళ్లింది. అయితే, కరోనా నేపథ్యంలో ఎవరూ తన పుట్టినరోజు వేడుకలను నిర్వహించవద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించడం గమనార్హం.
Chiranjeevi
Tollywood
Chandrababu
Telugudesam

More Telugu News