Sudheer Babu: చిక్కుల్లోపడే సినిమా డైరెక్టర్ గా సుధీర్ బాబు!

Sudheer Babu is seen as a director in Aa Ammayi Gurinchi Meeku Cheppali
  • ఇంద్రగంటితో మూడో సినిమా
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ  
  • కథానాయికగా అందాల కృతి శెట్టి
మొదటి నుంచి కూడా సుధీర్ బాబు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. అలా ఆయన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'సమ్మోహనం' .. 'వి' సినిమాలు చేశాడు. సమ్మోహనం సక్సెస్ కాగా .. 'వి' ఒక మంచి ప్రయోగం అనిపించుకుంది.

తాజాగా ఆయన ఇంద్రగంటి దర్శకత్వంలోనే మరో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరే 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇంద్రగంటి టైటిల్ ను ప్రకటించగానే యూత్ లో ఆసక్తి పెరిగింది. ఆ అమ్మాయి కృతి శెట్టి అనేసరికి ఇక ఈ సినిమా పైనే కుర్రాళ్లంతా పూర్తి దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది.

ఈ సినిమాలో సుధీర్ బాబు .. సినిమా డైరెక్టర్ పాత్రలో కనిస్తాడట. ఆయన ఒక సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఆయన చుట్టూ కొన్ని సరదా సంఘటనలు జరుగుతాయి. వాటిని లైట్ తీసుకున్న ఆయన ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు? తిరిగి ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు? అనేదే కథ అని అంటున్నారు.

ఈ మొత్తం సీన్లో ఆ అమ్మాయి కారణంగా ఆయన సమస్యల్లో పడ్డాడా? లేదంటే ఆమె అతణ్ణి బయటపడేసిందా? అనేదే సస్పెన్స్ గా అనిపిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి, వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Sudheer Babu
Indraganti
Kruthi Shetty

More Telugu News