కైవల్యానంద సరస్వతి కన్నుమూత

Kaivalyananda Saraswati Passed Away
విజయవాడ శంకరమఠానికి చెందిన కైవల్యానంద సరస్వతి కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. హరికథా విద్వాంసులుగా, బుర్రా శివరామకృష్ణ శర్మగా నగర ప్రజలకు చిరపరిచితమైన ఆయన 2011లో సన్యాసాన్ని స్వీకరించి కైవల్యానంద సరస్వతిగా మారారు.

విజయవాడ శంకరమఠంలో దశాబ్దకాలంగా భక్తులకు ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇస్తూ వారి మనసుల్లో స్థానం సంపాదించారు. నిన్న ఆయన నిర్యాణం చెందడంతో ఆశ్రమంలో విషాద వాతావరణం నెలకొంది. కాగా, ఆయనకు ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Go Back to Shorts
Burra Sivaramakrishna Sharma
Vijayawada
Shanka Math
Passes Away

More Telugu News