Janasena: దొంగ ఓట్లు వేయడం కూడా నవరత్నాల్లో భాగమేనా?: జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్

Jana Senas Nadendla Manohar fire on Jagan Govt
  • అధికారులు, పోలీసుల సాయంతో రిగ్గింగ్
  • ఇతర జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి మరీ దొంగ ఓట్లు
  • బీజేపీతో కలిసి ఈసీకి ఫిర్యాదు చేస్తాం
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక జరిగిన తీరుపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగిందని, పొరుగు జిల్లాల నుంచి బస్సుల్లో వచ్చి మరీ దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. అధికారులు, పోలీసుల సాయంతో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు.

ఇలా దొంగ ఓట్లు వేయడం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాల్లో’ భాగమేనా? అని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై బీజేపీతో కలిసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మనోహర్ తెలిపారు.
Janasena
Tirupati LS Bypolls
Nadendla Manohar
BJP

More Telugu News