Ambati Rambabu: చంద్రబాబు ఎక్కడపడితే అక్కడ చతికిలపడి కూర్చుంటున్నారు... ఏం ప్రయోజనంలేదు, గెస్ట్ హౌస్ కు దయచేయండి: అంబటి

Ambati Rambabu comments on Chandrababu protest in Tirupati
  • తిరుపతిలో చంద్రబాబు రోడ్ షో
  • రాళ్లు విసిరిన దుండగులు
  • రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు
  • వ్యంగ్యం ప్రదర్శించిన అంబటి
తిరుపతిలో చంద్రబాబు రోడ్ షోపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. దీనిపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యంగ్యం ప్రదర్శించారు. పార్టీని నిలబెట్టే శక్తిలేని బాబు గారు అసెంబ్లీలో, ఎయిర్ పోర్టులో, తిరుపతి నడిరోడ్డులో ఎక్కడ పడితే అక్కడ చతికిలపడి కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. దానివల్ల ఏమీ ప్రయోజనంలేదని, తొందరగా లేచి గెస్ట్ హౌస్ కు దయచేయాలని వ్యాఖ్యానించారు.

కాగా, చంద్రబాబు ప్రచార వాహనంపైనా రాళ్లదాడికి ప్రయత్నం జరగడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి జగన్ బెంబేలెత్తిపోతున్నాడని టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో విమర్శించింది.
Ambati Rambabu
Chandrababu
Protest
Tirupati
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News