ఎంబీఏ చదువుతున్నప్పటి ఫొటో పంచుకున్న హీరో సిద్ధార్థ్
- 2001లో ఎంబీయే చదివిన సిద్ధార్థ్
- ముంబయిలోని ఎస్పీజేఐఎంఆర్ కాలేజీలో విద్యాభ్యాసం
- స్నేహితురాలు మీనాల్ తో కలిసి ఫొటో
- అప్పుడే 20 ఏళ్లు గడచిపోయాయా అంటూ ఆశ్చర్యం
"ముంబయిలోని ఎస్పీజేఐఎంఆర్ కాలేజీ క్యాంపస్ లో నా ప్రియమైన స్నేహితురాలు మీనాల్ తో ఫొటో ఇది. కాలం ఎలా గడిచిపోతోందో? అప్పుడే 20 ఏళ్లయ్యాయా?" అని సిద్ధార్థ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆ ఫొటోలో తాను టోపీ పెట్టుకుని ఉన్నానని, అప్పట్లో తనను స్నేహితులు సిడీ అని పిలిచేవారని వెల్లడించాడు. 'అప్పటి నా నిక్ నేమ్ ఇప్పుడు మీక్కూడా తెలిసిపోయింది' అని వివరించాడు.