కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే రాజధానిగా తిరుపతి ప్రకటన: చింతా మోహన్
- వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితుల్లో ఆందోళన
- అధికారమిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
- కాంగ్రెస్ పనైపోయిందని కుహనా మేధావులు సంబరపడుతున్నారు
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వర్గాల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇప్పుడు దళితులు కాంగ్రెస్కు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం భెల్ పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవులను తీసుకొచ్చి తీరుతానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, విభజన గాయాన్ని చూపించి కాంగ్రెస్ పనైపోయిందని కుహనా మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ సంబరపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి త్వరలోనే సమాధానం లభిస్తుందని, మోదీ త్వరలో ఇంటికి వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజల్లో ఆర్థిక ఒత్తిడి ఎక్కువైందని, కాంగ్రెస్తోనే మళ్లీ మంచిరోజులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.