ఓ మహిళ ఆవేదనను వీడియో రూపంలో పంచుకున్న సోము వీర్రాజు
- జగన్ పాలనకు ఇదే నిదర్శనమన్న సోము వీర్రాజు
- ఇల్లు, రేషన్ కార్డు అడిగితే బెదిరిస్తున్నారన్న మహిళ
- రికార్డుల్లో చనిపోయినట్టు చూపిస్తున్నారని వెల్లడి
- గట్టిగా నిలదీస్తే కొట్టడానికి వస్తున్నారని ఆరోపణ
కాగా, తానే కాకుండా పిల్లాపాపలున్న అనేక మంది మహిళల పరిస్థితి ఇలాగే ఉందని ఆ మహిళ వాపోయింది. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నిస్తే ఏం చేస్తావని బెదిరిస్తూ పైపైకి వస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులందరిదీ ఇదే తీరని వెల్లడించింది.