Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి ఎదుట కోలాహలం మామూలుగా లేదు... ఫొటోలు ఇవిగో!

Huge fan crowd at Allu Arjun house in Hyderabad
  • నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు
  • బన్నీపై శుభాకాంక్షల జడివాన
  • ఈ ఉదయం నుంచే బన్నీ నివాసం వద్ద ఫ్యాన్స్
  • ఇంటి నుంచి వెలుపలికి వచ్చిన బన్నీ
స్టయిలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా రూపాంతరం చెందిన టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఈ ఉదయం నుంచే హైదరాబాదులోని అల్లు అర్జున్ నివాసం వద్ద అభిమానుల సందోహం నెలకొంది.

భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ పెద్దపెట్టున నినాదాలు చేస్తుండడంతో బన్నీ తన నివాసం నుంచి వెలుపలికి వచ్చారు. అభిమానులకు అభివాదం చేశారు. వారి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు. పలువురు అభిమానులు అందించిన మొక్కలను కానుకగా స్వీకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

కాగా, అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం టీజర్ వీడియో నిన్న రిలీజ్ కాగా, యూట్యూబ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Allu Arjun
Birthday
Fans
House
Hyderabad
Tollywood

More Telugu News