కామెంట్స్ పై కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్
- హాస్యనటిగా మంచి గుర్తింపు
- బరువు తగ్గిన విద్యుల్లేఖ రామన్
- ఆరోగ్య సమస్యలే కారణమని వెల్లడి
బొద్దుగా కనిపించే విద్యుల్లేఖ .. ఈ మధ్య కాస్త సన్నబడింది. దాంతో సోషల్ మీడియాలో కామెంట్లు ఎక్కువయ్యాయట. ఇకపై కమెడియన్ గా చేయవా? హీరోయిన్ గా మాత్రమే చేస్తావా ఏంటి? అంటూ కామెంట్లు చేశారట. సంపూర్ణేశ్ బాబు సరసన ఒక కథానాయికగా 'పుడింగి నెంబర్.1' సినిమా చేస్తున్న ఆమె, ఈ విషయాన్ని ప్రస్తావించింది. లావు బాగా పెరిగిపోవడం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయనీ, అందువలన తాను వర్కౌట్లు చేసి సన్నబడితే ఇలా కామెంట్లు చేస్తున్నారంటూ బాధను వ్యక్తం చేసింది. కామెడీతో కూడిన లీడ్ రోల్స్ చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేననే విషయాన్ని స్పష్టం చేసింది.