పాన్ ఇండియా సినిమా కోసం జార్జియాకి విజయ్!
- సన్ పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ మూవీ
- విజయ్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్
- రెట్టింపు పారితోషికం వసూలు చేస్తున్న పూజా హెగ్డే
దర్శకుడు నెల్సన్ కథలు విభిన్నంగా ఉంటాయి. ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో నయనతార ప్రధానమైన పాత్రను పోషించిన 'కొలమావు కోకిల' చూస్తే అర్థమైపోతుంది. అందువల్లనే విజయ్ ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను 'జార్జియా'లో ప్లాన్ చేశారట. తన ఓటు హక్కును వినియోగించుకున్న వెంటనే నిన్న విజయ్ 'జార్జియా' బయల్దేరినట్టుగా చెబుతున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విజయ్ కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మితం కావడం, ఈ సినిమా కోసం పూజా హెగ్డే రెట్టింపు పారితోషికం అందుకుంటూ ఉండటం విశేషం.