Samantha: 'శాకుంతలం' సెట్లో కోలీవుడ్ నటి!

Adithi Balan Role In Gunasekhar Shakunthalam
  • సమంత ప్రధానపాత్రధారిణిగా 'శాకుంతలం'
  • పాన్ ఇండియా సినిమా స్థాయిలో నిర్మాణం
  • వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు
రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' .. కొరటాల శివ 'ఆచార్య' తరువాత అందరిలో ఆసక్తిని రేపుతున్న భారీ ప్రాజెక్టు 'శాకుంతలం'. అందమైన ఈ ప్రేమకావ్యాన్ని అపూర్వమైన దృశ్యకావ్యంగా గుణశేఖర్ తీర్చిదిద్దుతున్నాడు. టైటిల్ రోల్ ను సమంత పోషిస్తోంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, తన కెరియర్లోనే ఆమె అత్యధిక పారితోషికాన్ని అందుకున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దుష్యంతుడి పాత్ర కోసం మలయాళ నటుడు దేవ్ మోహన్ ను తీసుకున్నాడు. ఆయనను చూసిన తరువాత గుణశేఖర్ ఎంపిక సరైనదేననే టాక్ వినిపించింది.


కథ ప్రకారం శకుంతలకి అనసూయ - ప్రియంవద అనే ఇద్దరు స్నేహితురాళ్లు ఉంటారు. వాళ్లలో అనసూయ పాత్రకి ఈషా రెబ్బాను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక మరో ముఖ్యమైన పాత్రకి గాను తమిళనటి 'అదితి బాలన్'ను తీసుకున్నారు. ఆల్రెడీ షూటింగులో ఆమె పాల్గొంటోందని అంటున్నారు. తమిళంలో సహజనటిగా ఆమెకి మంచి గుర్తింపు ఉంది. అయితే 'శాకుంతలం'లో ఆమె ప్రియంవద పాత్ర చేస్తుందా? లేదంటే 'కణ్వ మహర్షి' ఆశ్రమంలో శకుంతలకి పెద్ద దిక్కుగా ఉండే గౌతమి పాత్ర చేస్తోందా? అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha
Dev Mohan
Esha Rebba
Gunasekhar

More Telugu News