సంపూర్ణేష్ బాబు హీరోగా 'పుడింగి నెంబర్ 1'
- ఇద్దరు హీరోయిన్లతో సంపూ
- కీలకమైన పాత్రలో పోసాని
- జులైలో ప్రేక్షకుల ముందుకు
సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా ఈ రోజునే ఈ సినిమా హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కేఎస్ రామారావు క్లాప్ ఇవ్వగా .. భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ఇక పలు చిత్రాలలో హాస్యనటిగా మెప్పించిన విద్యుల్లేఖ రామన్ ఈ సినిమాతో కథానాయిక అవుతోంది. మరో కథానాయికగా సాఫీ కౌర్ పరిచయమవుతోంది. పోసాని ... అజయ్ ఘోష్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగు జరుపుకోనుంది. జులైలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.