Nizamabad District: కరోనా సోకినా సేవలందిస్తున్న వైద్య సిబ్బంది.. నిజామాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మూసివేత

medical staff infected to corona in nizamabad private hospitla
  • ఆసుపత్రిలోని 10 మంది సిబ్బందికి కరోనా
  • అయినా విధుల్లోనే వున్న సిబ్బంది 
  • విచారణ చేపట్టిన అధికారులు
సిబ్బందికి కరోనా వైరస్ సోకినప్పటికీ రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రిని అధికారులు మూసివేశారు. నిజామాబాద్‌లోని నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ  ఆసుపత్రి సిబ్బందిలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 10 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. ఆసుపత్రి యజమాని అయిన డాక్టర్ నిష్కల్ ప్రభు మాత్రం తొలుత పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోయారు. అయితే, సాయంత్రం  ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది.

ఆసుపత్రిలోని 10 మంది సిబ్బందికి వైరస్ సోకినప్పటికీ ఐసోలేషన్‌లోకి వెళ్లకుండా  రోగులకు సేవలు అందిస్తున్న విషయంపై జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నిన్న సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్న డీఎం అండ్ హెచ్ఓ సుదర్శనం ఆసుపత్రిని మూసివేసి విచారణ చేపట్టారు.
Nizamabad District
Hospital
Corona Virus

More Telugu News