ఏపీలో కరోనా విజృంభణ... 1,730 కొత్త కేసులు నమోదు
- గత 24 గంటల్లో 31,072 కరోనా పరీక్షలు
- గుంటూరు జిల్లాలో 378 మందికి పాజిటివ్
- చిత్తూరు జిల్లాలో 338 కేసులు నమోదు
- కరోనా నుంచి కోలుకున్న 842 మంది
- మరో ఐదుగురి మృతి
అదే సమయంలో 842 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,07,676 మందికి కరోనా సోకగా, వారిలో 8,90,137 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,300 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మరణాల సంఖ్య 7,239కి చేరింది.