Bihar: హాప్‌ షూట్స్‌... బిహార్‌ రైతు.. రూ. లక్షల్లో ఆదాయం.. ఇదంతా వట్టిదేనట

Bihar Farmers Hop Shoots Story proved  Wrong no such Crop is cultivated there
  • బిహార్‌ రైతు హాప్‌ షూట్స్‌ పండిస్తున్నాడని ప్రచారం
  • కిలోకు రూ.80 వేల లెక్కన రూ.లక్షలు గడిస్తున్నాడని వదంతులు
  • అంతా వట్టిదేనని తేలిన వైనం
  • అమ్రేష్‌ అటువంటి పంటే పండించడం లేదని స్పష్టం చేసిన స్థానికులు
హాప్‌ షూట్స్‌.. దేశవ్యాప్తంగా గత రెండు, మూడు రోజులుగా చర్చకు తెరదీసిన పంట ఇది. దీని ధర కిలోకు రూ. 80 వేల వరకు ఉంటుందని వార్తలొచ్చాయి. దీన్ని ఆహారంతో పాటు, ఔషధాలు, బీర్ల తయారీలో వాడతారని, అందుకే అంత ధర పలుకుతుందని అంతా చెప్పుకున్నారు. నిజానికి ఇదంతా వాస్తవమే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంటల్లో ఇదీ ఒకటి.  భారత్‌కు పెద్దగా పరిచయంలేని ఈ పంటకు పాశ్చాత్య దేశాల్లో మంచి గిరాకీ ఉంది.

ఇదంతా పాత విషయమే కదా! మళ్లీ ఎందుకు ఇదంతా అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు విషయం! నిజానికి ఈ పంటను బిహార్‌కు చెందిన అమ్రేశ్‌ సింగ్‌(38) అనే రైతు పండిస్తున్నాడని.. రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడని పత్రికల్లో మార్మోగింది. ఆయన ఆలోచన, రసాయనాలు లేకుండా పండిస్తున్న తీరును మీడియా ప్రస్తుతించింది. తీరా ఆయన్ని కలవడానికి వెళ్లిన స్థానిక పాత్రికేయులకు ఇదంతా ‘తూచ్‌’ అని తెలిసింది. నిజానికి అమ్రేశ్ అలాంటి పంటే పండించడం లేదని స్థానికులు సైతం ధ్రువీకరించారు. దీంతో ఇప్పటి వరకు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన సమాచారమంతా వట్టిదేనని తేలింది.
Bihar
Hop Shoots
farmer

More Telugu News