Veerappan: కోలీవుడ్‌లోకి స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విజయలక్ష్మి.. ఆమె ప్రధాన పాత్రలో ‘మావీరన్ పిళ్లై’

Veerappan daughter Vijayalaxmi Enters Kollywood
  • వీరప్పన్ మరణానంతర కథగా సమాచారం
  • బీజేపీలో చేరిన వీరప్పన్ పెద్దకుమార్తె విద్యారాణి
  • సినిమాల్లో భవిష్యత్ వెతుక్కుంటున్న విజయలక్ష్మి
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ రెండో కుమార్తె విజయలక్ష్మి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ప్రధాన పాత్రలో ‘మావీరన్ పిళ్లై’ అనే సినిమా రూపొందుతోంది. కేఎస్ఆర్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవివర్మ సంగీతం, మంజునాథ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను నిన్న విడుదల చేశారు. భుజంపై తుపాకితో సీరియస్ లుక్‌లో విజయలక్ష్మి కనిపించింది. దీంతో ఇది కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమా అయి ఉంటుందని భావిస్తున్నారు. మరోపక్క, వీరప్పన్ పెద్దకుమార్తె విద్యారాణి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
Veerappan
Vijayalxmi
Kollywood

More Telugu News