Jagan: ఈరోజు కరోనా వ్యాక్సిన్ వేయించుకోనున్న జగన్

Jagan to take Covid Vaccine today
  • భారతపేట 140వ వార్డులో వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు
  • ఉదయం 11 గంటలకు వ్యాక్సిన్ తీసుకోనున్న జగన్
  • కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసేందుకు అధికారుల ఏర్పాట్లు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. గుంటూరు-అమరావతి రోడ్డులోని భారతపేట 140వ వార్డు సచివాలయంలో సీఎంకు వ్యాక్సిన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఉదయం 11 గంటలకు ఆయన వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.

45 ఏళ్లు దాటిన వారికి దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం లేకుండా ఈరోజు నుంచి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ కేటగిరీ కింద జగన్ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. జగన్ కు కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసేందుకు వైద్యాధికారులు ఏర్పాట్లు చేశారు.

మరోవైపు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే... అక్కడి నుంచే గ్రామ/వార్డు సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను జగన్ ప్రారంభిస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత విజయవాడలో జరిగే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్  ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఓరియంటేషన్ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.
Jagan
YSRCP
Corona Virus
Vaccine

More Telugu News