‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూబ్లీహిల్స్ పోలీసుల అనుమతి నిరాకరణ

Jubileehills police deny permission for Vakilsab pre release event
  • పవన్ అభిమానులకు నిరాశ
  • కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమన్న పోలీసులు
  • సభలు, సమావేశాలకు అనుమతి లేదంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీసులు అనుమతి నిరాకరించారు. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖరరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

యూసుఫ్‌గూడలోని పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 3న పవన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీనికి అనుమతి కోరుతూ జె.మీడియా పోలీసులకు లేఖ రాసింది. ఈ ఫంక్షన్‌కు 5 నుంచి 6 వేల మంది హాజరవుతారని ఆ లేఖలో నిర్వాహకులు పేర్కొన్నారు.

అయితే, రాష్ట్రంలో కరోనా మళ్లీ చెలరేగుతున్న నేపథ్యంలో సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
Go Back to Shorts
Pawan Kalyan
Vakeel Saab
Pre Release Event

More Telugu News