పళనిస్వామి కంటతడి పెట్టడం బాధించింది.. క్షమాపణ చెబుతున్నా: డీఎంకే నేత ఎ.రాజా
- పళనిస్వామిని దూషించాలనే ఉద్దేశం నాకు లేదు
- రాజకీయ జీవితాలను పోలుస్తూ కామెంట్ చేశానన్న రాజా
- రాజాపై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల కేసు నమోదు
పళనిస్వామి కంటతడి పెట్టడం తనను బాధించిందని రాజా అన్నారు. వ్యక్తిగతంగా ఆయనను దూషించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. రాజకీయ జీవితాలను పోల్చుతూ మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. పళనిస్వామికి క్షమాపణ చెపుతున్నానని అన్నారు. మరోవైపు రాజా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.