మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోల హతం!
- ఖురుకేడ తాలూకాలో ఎన్ కౌంటర్
- మృతులలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు
- తప్పించుకున్న మావోల కోసం కొనసాగుతున్న కూంబింగ్
చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్టు తెలుస్తోంది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పించుకున్న వారిలో కూడా కొందరికి తీవ్ర గాయాలయినట్టు సమాచారం. అందరినీ ఏరివేసేంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు.