ఢకసాుతాుా: గ్రేటర్ పరిధిలో భానుడి భగభగలు!

Heat Waves in Telangana

  • పెరుగుతున్న వేసవి తాపం
  • ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత
  • గ్రేటర్ లో 39 డిగ్రీలను దాటిన ఉష్ణోగ్రత  

గ్రేటర్ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలో వేసవి తాపం పెరిగిపోతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎండ తీవ్రత అధికంగా ఉంటుండగా, తోపుడు బండ్ల వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సెంట్రల్ మహారాష్ట్ర పరిసరాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో, ఆ ప్రభావం తెలంగాణపై పడిందని, దీనివల్లే ఎండ వేడిమి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక గ్రేటర్ పరిధిలోని నారాయణగూడలో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, సగటున ప్రతి ప్రాంతంలో 39 డిగ్రీల వేడిమి నమోదైంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News