Masks: ఏపీలో మాస్కులు ధరించనివారికి వడ్డన... ఒక్కరోజులో రూ.17.34 లక్షలు వసూలు చేసిన పోలీసులు

Police conduct special drive for wearing masks in AP
  • పెరుగుతున్న కరోనా తీవ్రత
  • మాస్కులు ధరించడంపై స్పెషల్ డ్రైవ్
  • నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానా
  • రూ.2.10 లక్షలు వసూలు చేసిన ప్రకాశం పోలీసులు
కరోనా మళ్లీ విస్తరిస్తుండడంతో ఏపీలో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో  మాస్కులు పెట్టుకోవడంపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తున్నవారికి జరిమానా వడ్డించారు. నిన్న ఒక్కరోజే 18,565 మందికి జరిమానాలు విధించడం ద్వారా రూ.17.34 లక్షలు వసూలు చేశారు.

అత్యధికంగా ప్రకాశం జిల్లా పోలీసులు రూ.2.10 లక్షలు జరిమానాల రూపంలో రాబట్టారు. అత్యల్పంగా రాజమండ్రి అర్బన్ పోలీసులు రూ,2,800 వసూలు చేశారు. కాగా, పలు చోట్ల పోలీసులే మాస్కులు పంచారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కలిగించే ప్రయత్నం చేశారు. మాస్కులు ధరించిన వారికి గులాబీ పూలు ఇచ్చి అభినందించారు.
Masks
Andhra Pradesh
Police
Corona Virus
Pandemic
Second Wave

More Telugu News