Air India: ఎయిరిండియాను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం.. కేంద్ర ముందు రెండే మార్గాలు!

no choice other than privatisation or closing air india
  • పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు 
  • ప్రైవేటీకరించకపోవడం అనే సమస్యే లేదు
  • సంస్థకు రోజుకు రూ.20 వేల కోట్ల నష్టం
  • సంస్థ పేరు మీద రూ.60 వేల కోట్ల రుణాలు
ఎయిరిండియా ప్రైవేటీకరణపై పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని ప్రైవేటీకరించడమా? లేక పూర్తిగా మూసివేయడమా? అనే రెండు మార్గాలు ప్రభుత్వం ముందున్నాయన్నారు. కానీ ప్రైవేటీకరించకపోవడం అన్న ప్రత్యామ్నాయమే కేంద్ర ప్రభుత్వం ముందు లేదన్నారు. ఎయిరిండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందని మంత్రి తెలిపారు. సంస్థ పేరుమీద ఇప్పటికే రూ.60,000 కోట్ల మేర రుణాలు పేరుకుపోయాయన్నారు.

ఎయిరిండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్‌ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని శుక్రవారం హర్దీప్‌ తెలిపారు. మే నెలాఖరుకు పూర్తికావచ్చని అంచనా వేశారు. ఆ తర్వాతే ఎయిరిండియా ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలుస్తుందన్నారు. మరోవైపు ఎయిరిండియా కోసం ఆల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతో కలిసి స్పైస్‌జెట్‌ యజమాని అజయ్‌సింగ్‌, ఢిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ అంకుర్‌ భాటియా, టాటా సన్స్‌ బిడ్లు దాఖలు చేసినట్లు సమాచారం.
Air India
Privatisation
Hardip Singh Puri

More Telugu News