Ramcharan: 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు... ఫొటోలు ఇవిగో!

Ram Charan celebrates his birthday on RRR sets last night
  • నేడు రామ్ చరణ్ పుట్టినరోజు
  • గత రాత్రి వేడుకలు నిర్వహించిన 'ఆర్ఆర్ఆర్' యూనిట్
  • చరణ్ తో కేక్ కట్ చేయించిన రాజమౌళి
  • సెట్స్ పై కోలాహలం
టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలను 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ఘనంగా నిర్వహించింది. గత రాత్రి సెట్స్ పైనే రామ్ చరణ్ తో కేక్ కట్ చేయించిన దర్శకుడు రాజమౌళి తదితరులు తమ హీరోకు విషెస్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాజమౌళితో పాటు 'ఆర్ఆర్ఆర్' నిర్మాత డీవీవీ దానయ్య, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, రాజమౌళి తనయుడు కార్తికేయ ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల కారణంగా 'ఆర్ఆర్ఆర్' సెట్స్ పై మరింత ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన ఫొటోలు మెగా ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Ramcharan
Birthday
RRR
Rajamouli
Tollywood

More Telugu News