పురుషులపై పర్యావరణ ప్రభావం.. స్కై న్యూస్ కథనాన్ని షేర్ చేసిన దియా మీర్జా
- పర్యావరణ పరిరక్షణలో ముందుండే దియా
- ఇకనైనా ప్రపంచం సీరియస్గా తీసుకోవాలని ఆశ
- పెళ్లిని పూర్తి పర్యావరణ హితంగా చేసుకున్న నటి
నిజానికి దియా మీర్జాకు పర్యావరణంపై శ్రద్ధ ఎక్కువ. అవకాశం దొరికిన ప్రతిసారీ గాలిలో కలుస్తున్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, సహజ వనరుల వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటి గురించి ఉపన్యాసాలు ఇస్తుంటుంది. చెప్పడమే కాదు, ఆమె తన నిత్య జీవితంలో పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా నడుచుకుంటారు. ఆమె చేసే ప్రతీ పని పర్యావరణహితంగానే ఉంటుంది.
గత నెలలో వైభ్ రేఖి అనే వ్యాపారవేత్తను పెళ్లాడిన దియా.. ఆ వేడుకను పూర్తి పర్యావరణ హితంగా నిర్వహించింది. కాగా, దియా తొలిసారి తెలుగులో నాగార్జున సరసన నటిస్తోంది. అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమాలో ఓ ఎమోషనల్ పాత్రలో దియా మీర్జా నటిస్తోంది.