Ramcharan: రామ్ చరణ్ కు మహిళా అభిమాని నుంచి అపురూపమైన కానుక

Hyderabad woman gifts Ram Charan a broom sticks house model
  • ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్న రామ్ చరణ్
  • బొడ్డు శ్రీమతి అనే అభిమాని నివాసానికి వెళ్లిన చరణ్
  • చరణ్ కు కొబ్బరిపుల్లల ఇంటిని బహూకరించిన శ్రీమతి
  • ఆమె అభిమానానికి ఫిదా అయిన మెగా హీరో
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నప్పటికీ వీలు చిక్కినప్పుడుల్లా ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ కు చెందిన బొడ్డు శ్రీమతి అనే మహిళ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రామ్ చరణ్ విచ్చేశారు. బొడ్డు శ్రీమతి హీరో రామ్ చరణ్ కు వీరాభిమాని. ఆమె తన అభిమాన హీరో కోసం కొబ్బరి చీపురుపుల్లలతో అందమైన ఇంటిని తయారుచేశారు.

దాన్ని రామ్ చరణ్ కు ఇవాళ అందజేశారు. బొడ్డు శ్రీమతి అభిమానానికి చరణ్ ముగ్ధుడయ్యారు. మెగా పవర్ స్టార్ రాకతో శ్రీమతి, ఆమె కుటుంబ సభ్యులు సంతోషంతో పొంగిపోయారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Ramcharan
Boddu Srimathi
Broomsticks House
Hyderabad
Tollywood

More Telugu News