Srikanth: బాలకృష్ణ సినిమాలో కీలక పాత్రలో శ్రీకాంత్

Srikanth to play key role in Balakrishna film
  • ముఖ్య పాత్రలు కూడా పోషిస్తున్న శ్రీకాంత్ 
  • బోయపాటి దర్శకత్వంలో బాలయ్య 'బీబీ3'   
  • బర్త్ డే సందర్భంగా శ్రీకాంత్ కి విషెస్ చెప్పిన టీమ్     
ఒకప్పుడు బిజీ స్టార్ గా వెలుగొందిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఖాతాలో ఎన్నో హిట్స్ వున్నాయి. మొదటినుంచీ ఒక రేంజి నిర్మాతలకు అందుబాటులో ఉంటూ.. పలు చిత్రాలలో నటిస్తూ తన కెరీర్ని ఆయన కొనసాగిస్తూ వచ్చాడు. ఇప్పటికీ ఓపక్క కొన్ని సినిమాలలో హీరోగా నటిస్తూనే.. మరోపక్క అప్పుడప్పుడు ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేస్తూనే వున్నాడు.

ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో శ్రీకాంత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'బీబీ3' వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ గత కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు.

ఈ రోజు శ్రీకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీబీ 3 చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్ ఆయనకు విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇక ఈ బీబీ 3 చిత్రం టైటిల్ని త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Srikanth
Balakrishna
Boyapati Sreenu

More Telugu News